అధ్యయనోత్సవాలు.. రామావతారంలో యాదాద్రీశుడు

53చూసినవారు
అధ్యయనోత్సవాలు.. రామావతారంలో యాదాద్రీశుడు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదగిరిగుట్టలో శుక్రవారం నుండి బుధవారం వరకు అధ్యయనోత్సవములు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆదివారం స్వామి వారిని శ్రీ రామావతారములో అలంకరించి, భక్తుల దర్శనార్థము ఆలయ తిరువీధులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్