కాకరకాయలో అనేక పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ తింటే చేదుగా ఉన్నా కూడా.. అది వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో కాకరకాయ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే చరాన్టిన్ సమ్మేళనం రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా ఈ జ్యూస్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.