తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు హీరోయిన్ షాజన్ పదమ్సీ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తన ప్రియుడు, బిజినెస్మెన్ ఆశిష్ కనాకియాతో ఆమె వివాహం జరగనుంది. కాగా, కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆగలేకపోతున్నానంటూ కాబేయే భర్తతో ఉన్న ఫొటోలను ఆమె పంచుకున్నారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్', హీరో రామ్ నటించిన 'మసాలా' మూవీలోనూ ఆమె నటించారు.