మునిగిన విలాసవంతమైన నౌక .. ప్రముఖ వ్యాపారవేత్త గల్లంతు (వీడియో)

80చూసినవారు
ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్‌యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ అదృశ్యమయ్యాడు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్‌ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఒకరి మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రమాదం నుంచి లించ్‌ భార్యతో పాటు మరో 14 మంది బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్