నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ

55చూసినవారు
నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బోస్ కోల్‌కతాలోని సెయింట్ లారెన్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి బీ.కాంలో పట్టభద్రుడయ్యారు. అనంతరం సురేంద్రనాథ్ లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లాస్ పూర్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్