నేటి డిజిటల్ యుగంలో ఎమోజీల వినియోగం ఎక్కువైపోయింది. 90%పైగా నెటిజన్లు తమ ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కన్నా ఎమోజీలను అధికంగా ఉపయోగిస్తున్నారు. అందుకే ప్రతి ఏడాది జులై 17న ప్రపంచ ఎమోజీ డేని జరుపుకుంటున్నారు. ఇక ఇండియన్స్ ఎక్కువగా క్లాసిక్ రెడ్ హార్ట్ ఎమోజీని వాడుతున్నట్లు ఓ నివేదికలో తేలింది. రెడ్ హార్ట్, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్ గ్లాసెస్ ఎమోజీ, కళ్లతో నవ్వే స్మైల్ ఎమోజీలు టాప్-5లో ఉన్నాయి.