రాహుల్ గాంధీపై పోటీ చేయ‌నున్న సురేంద్ర‌న్

563చూసినవారు
రాహుల్ గాంధీపై పోటీ చేయ‌నున్న సురేంద్ర‌న్
రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై .. ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే సురేంద్ర‌న్ పోటీ ప‌డ‌నున్నారు. శ‌బ‌రిమ‌ల‌లో మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని వ్య‌తిరేకిస్తూ ఆయ‌న ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం త‌ర్వాత‌ వ‌య‌నాడ్ స్థానం కీల‌కంగా మారింది. తిరువనంత‌పురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌, ఎంపీ శ‌శి థ‌రూర్ మ‌ధ్య పోటీ జ‌ర‌గ‌నున్న‌ది.

సంబంధిత పోస్ట్