TG: రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ యోగ్యంగాని భూముల గుర్తింపునకు ఈ నెల 16 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. గుర్తించిన భూముల జాబితాలను ప్రదర్శించేందుకు 21 నుంచి 24 వరకు గ్రామసభలు జరపాలని ఆదేశించింది. పట్టాదారు పాస్ బుక్‌ల ఆధారంగా ప్రతి గ్రామంలో AEO, RIలు బృందంగా ఈ సర్వే చేస్తారు. 25న ఈ జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. వాటి ఆధారంగా సాగులో ఉన్న వారికి రైతుభరోసా సాయం ప్రభుత్వం 26న విడుదల చేస్తుంది.