బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన బాబు(27) ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. దుకాణం యజమాని మారడంతో అతనిని పని నుండి తీసేసారు. రెండు నెలలుగా కాలిగా ఉన్న బాబు అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనస్తాపానికి గురై గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గురువారం ఉదయం గొర్రెల కాపరి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.