చింతపల్లి మండలం ధైర్యపురి తండాకు చెందిన రామావత్ బాలయ్య(65) మనమడి పెళ్లికోసం పందిరి వేయడానికి చెట్ల కొమ్మల కోసం గురువారం చెట్టు ఎక్కి నరుకుతుండగా అకస్మాత్తుగా కాలు జారి బావిలో పడ్డాడు. ఆ బావిలో నీరు లేకపోవడంతో గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. తాత మృతితో ఇరు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది.