సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ 8 వార్డ్ కౌన్సిలర్ చిలక బత్తిని సౌజన్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఆఫీస్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి
కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పలువురు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు.