గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి యాప్ వలన రైతులకు సంబందించిన భూములు ఒకరివి మరొకరి పేరుతో రావడం, కొందరికి పాస్ పుస్తకాలు రాక ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం వెంటనే ధరణి యాప్ ప్రక్షాళన చేసి రైతులు పడుతున్న భాదలు తీర్చాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గరిడేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, అనంతరం వినతి పత్రం అందజేశారు.