ఆధ్యాత్మికతతో శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు అన్నారు. ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో త్రైత సిద్ధాంతం ఆధారంగా యోగేశ్వర్లు రచించిన భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలను హుజూర్నగర్ పట్టణంలో ఏబీఎన్ అపార్ట్మెంట్ ఏరియాలో ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ధర్మం అనే పదాన్ని ప్రపంచ విషయాలు వాడకుండా దేవుని విషయంలో వాడితే బాగుంటుందని తెలిపారు.