సాగర్ నీటితో చెరువులు నింపాలని ధర్నా

1940చూసినవారు
సాగర్ నీటితో చెరువులు నింపాలని ధర్నా
సాగర్ ఎడమ కాలువ నీళ్లను రెవిన్యూ, పోలీసు, ఇరిగేషన్ డిపార్టెంట్ సిబ్బందిని పెట్టి నిర్బంధంగా ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరు రిజర్వాయర్ కు నీటిని తరలించడం సరైంది కాదని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోకన్వీనర్ పందిటి నవీన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తాగునీటి విషయమై ధర్నా నిర్వహించారు. సాగర్ నీటి తో చెరువులను నింపాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్