కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న బిష్ణోయ్ (వీడియో)

74చూసినవారు
లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. బిష్ణోయ్ వేసిన బంతిని విలియమ్సన్ బౌలర్ పక్క నుంచి పంచ్ షాట్ ఆడాడు. బ్యాట్‌కు మిడిల్ అయిన బంతి రవి బిష్ణోయ్ కుడివైపు గాల్లో లేచింది. వెంటనే బిష్ణోయ్ అమాంతం గాల్లోకి లేచి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్