మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) తాటి చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటేశం వృత్తి గీత కార్మికుడు. అతని భార్య మతి స్మితం కోల్పోవడంతో పెద్ద వయస్సులో ఇంటి పని , భార్యకు సేవలు చేయడం, కల్లు గీయడం పనులతో మానసికంగా కుంగిపోయి ఆత్మ హత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.