మేళ్లచెరువు మండలం దొండపాడుకు చెందిన న్యాయవాది బొబ్బ కోటిరెడ్డి సూర్యాపేట జిల్లా ప్రభుత్వా న్యాయవాదిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎన్ కొండారెడ్డిలకు గురువారం కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కక్షిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కోటిరెడ్డి నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.