మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి అనిత ఆధ్వర్యంలో గ్రామంలోని మురికి నీటి గుంటలను శుభ్రపరచడం, చెత్తాచెదారాలను తొలగించడం, పాఠశాలలోని విద్యార్థులకు ఆరోగ్యకరమైన అలవాట్లను, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పరిసరాలను ఏ విధంగా శుభ్రపరుచుకోవాలి అనే అంశాలపై హెల్త్ సిబ్బందితో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్, తదితరులు పాల్గొన్నారు.