YCP మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన అత్యాచారం కేసు హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. బుధవారం జరిగిన విచారణకు బాధితురాలు హైకోర్టుకు హాజరై.. నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని, పోలీసులు కేసును కొట్టేస్తే అభ్యంతరం లేదంటూ ప్రమాణపత్రం దాఖలుచేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ స్పందిస్తూ, అలా కోరగానే కేసును కొట్టేయలేమన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్ల తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.