కోదాడ: కాలువ కట్ట తెగే ప్రమాదం

77చూసినవారు
నడిగూడెం మండలం రత్నవరం సమీపంలో 14వ నెంబర్ కాలువలో నీరు ఎక్కువై సుమారు అర కిలోమీటర్ కట్టపై నుండి పారుతుంది. నీటి ఉధృతికి కాల్వకట్ట తెగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే కాలువ నీటి ఉధృతిని తగ్గించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్