రైతులు వానాకాలం వరి పంట కోతలు పూర్తికాగానే చాలా మంది రైతులు వరి కొయ్యలను కాల్చుతున్నారని
ఈ విధానంతో నష్టం జరిగే అవకాశం ఉందని నడిగూడెం ఏవో దేవప్రసాద్ తెలిపారు. భూమిలో కోట్ల సంఖ్యలో బ్యాక్తిరియా ఉంటుందని
ఈ బ్యాక్తిరియా ఎల్లపుడూ భూమిని సజీవంగా ఉంచుతుందన్నారు.
వరి కొయ్యలను కాల్చితే వేడిమితో బ్యాక్తిరియా చనిపోయి భూమి నిర్జీవం అయ్యి కాలుష్యం వెలువడటంతో పంటలు పండవని అన్నారు.