ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో శాంతి సామరస్యాలు నెలకొల్పబడతాయని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది కాలేజ్ శ్రీనివాస్ నాయుడు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని గాలి రమేష్ నాయుడు అయ్యప్ప స్వాములు అన్నదాన సన్నిధానంలో దాత చార్టెడ్ అకౌంట్ కన్వర్ల పూడి రఘునాథ్ స్వప్న దంపతులు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఉన్నారు.