గ్రామపంచాయతీ కార్మికుల పెండింగులో ఉన్న వేతనాలను ఇవ్వాలని అనంతగిరి మండల వివిధ గ్రామాల పంచాయతీ కార్మిక సంఘ నాయకులు అన్నారు. సకాలంలో వేతనాలు రాకపోవడంతో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. మండలంలోని గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య విభాగం, నీటి సరఫరా, విద్యుత్ దీపాల, ట్రాక్టర్ డ్రైవర్లు, వివిధ నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలల నుండి వేతనాలు రాక పూట గడవక పస్తులుండే పరిస్థితి ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.