కోదాడ లోని స్వయంభు శ్రీ గుంటి రఘునాధ స్వామి ఆలయం లో ధనుర్మాస ఉత్సవాల సందర్భముగా గోదా రంగనాధులకు పైడిమర్రి హనుమంత రావు, అరుణలు గురు వారం 1000 తామర పుష్పాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. గోదా రంగనాధులకు భక్తులు వడిబియ్యం సమర్పించారు. రేపు శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భముగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలనిఆలయ చైర్మన్ రంగయ్య, కార్య నిర్వహణాధికారి తుమ్మల వెంకట చలపతి కోరారు.