భవిష్యత్తులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. ఓ సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ ను ముఖ్యమంత్రి గారూ అని సంబోధించారు. గతంలోనే ఉత్తమ్ కు సీఎం పదవి కొద్దిలో మిస్ అయ్యింది. ఈసారి మాత్రం పక్కాగా ఆయనకే ముఖ్యమంత్రి పీఠం అని తన నాలుకపై నల్లమచ్చలు ఉన్నాయని తాను ఏదంటే అది జరిగి తీరాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.