నడిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న సూపరింటెండెంట్ సయ్యద్ ఇమామ్ ను రెగ్యులర్ ఎంపీడీవో గా నియామకం చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ రామచంద్రన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జి ఎంపీడీవో గా పనిచేస్తున్న ఆయన రెగ్యులర్ ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ ఇమామ్ ను ఏఈ లావణ్య, ఎంపిఓ విజయ కుమారి, ఖాసింబాబు, హరీష్ లు అభినందించారు.