కోదాడ పట్టణ ఎస్ఐ గా షేక్ సైదులు మంగళవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా కోదాడ టౌన్ లో ఖాళీగా ఉన్న పోస్టులో ఆయన నియామకమయ్యారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ, అందరి సహకారంతో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు. నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సైదులుకు పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలుకుతూ అభినందించారు.