టీఎస్ యుటిఎఫ్ నూతన కార్యవర్గం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో అగ్రస్థానంలో నిలవాలని జిల్లా కార్యదర్శి సిహెచ్ వీరారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మామిళ్ళగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్షునిగా శీనయ్య, ఉపాధ్యక్షులుగా కే సాయి శ్యామ్, డి చంద్రకళ, ప్రధాన కార్యదర్శిగా నరేందర్ కోశాధికారిగా ధరావత్ శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.