ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కి వినతి పత్రం..
సూర్యాపేట జిల్లా ముదిరాజులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మద్దిరాల తహసిల్దార్ కి బుధవారం రోజు ముదిరాజ్ సంఘ నాయకులు వినతి పత్రం అందించారు. బీసీడీ నుంచి బీసీ ఏకు రిజర్వేషన్ మార్చాలని, 1000 కోట్ల పారిశ్రామిక సొసైటీ ఏర్పాటు, సభ్యులకి 75 వేల సబ్సిడీతో కూడిన నిధులను మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. బిఎస్ ముదిరాజ్, వెలుగు వెంకన్న, బీసు కృష్ణ పులుగుజ్జు సుధాకర్ , సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.