రైలు పట్టాలు తప్పేందుకు కుట్ర.. తప్పిన ముప్పు (Video)

63చూసినవారు
గుజరాత్‌లో రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలో అప్ లైన్ రైల్వేట్రాక్‌లోని ఫిష్ ప్లేట్, కీని కొందరు దుండగులు తెరిచి ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన తర్వాత రైలు సేవలను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్