తెలంగాణలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపుర్‌లో సాయి కుమార్ (24), వీణ (22) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు సూసైడ్ చేసుకుని మరణించారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించిన పోలీసులు విచారణ చేపట్టారు.