భారత స్వాతంత్య్ర సమరయోధుడు, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నేడు. బాపూజీ 97 సంవత్సరాల వయస్సులో 2012, సెప్టెంబరు 21న హైదరాబాదులో మరణించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త.