నేరేడుచర్లలో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య
నేరేడుచర్ల పట్టణంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సె రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చింతబండ కాలనీకి చెందిన ఎడ్ల సైదులు (44) అనే వ్యక్తి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇంట్లో ఫ్యాన్ కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య జానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.