పాము కాటుతో వ్యక్తి మృతి
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం టిక్య తండాలో పాముకాటుతో వ్యక్తి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బుక్య శ్రీనివాస్, వ్యవసాయ పొలం వద్ద పనిచేస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. కగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు, మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, నూతనకల్ ఎస్సై మహేంద్ర నాథ్, తెలిపారు.