INDvsBAN.. పంత్-లిటన్ దాస్ మధ్య గొడవ.. వీడియో వైరల్

70చూసినవారు
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇవాళ రిషభ్ పంత్-లిటన్ దాస్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 16వ ఓవర్లో పంత్ సింగిల్ తీయాలనుకున్నాడు. కానీ, జైస్వాల్ నిరాకరించి అతడిని వెనక్కి పంపాడు. ఈ సమయంలో ఓ ఫీల్డర్ విసిరిన బంతి పంత్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో పంత్ కాస్త అసంతృప్తిగా కనిపించాడు. స్టంప్ మైక్ సహాయంతో లిటన్ దాస్‌తో ‘అతన్ని విసరవద్దు అని చెప్పండి. నన్నే ఎందుకు బంతితో కొడుతున్నాడు’ అని చెప్పడం వినిపించింది.

సంబంధిత పోస్ట్