పారిశుద్ధ్యం పనులు సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ జడ్పీ సిఈఓ అప్పారావుతో కలిసి ఎంపిడిఓ, ఎంపిఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా గ్రామాలలో యాంటీ లార్వా స్ప్రే, ఫాగింగ్ చేసే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో
డి ఎల్ పి ఓ నారాయణ రెడ్డి ఉన్నారు.