అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) సూర్యాపేట జిల్లా ధర్మబిక్షం భవన్ లో జరిగిన సమావేశంలో AISF సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు జుజ్జురి వేణు కూమర్ గౌడ్ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రారంభం కావడానికి ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది. అయినా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసినట్టు ఉందని ఆయన అన్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఈ విద్యాసంవత్సరం నుంచి ధరల అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన బడి కార్యక్రమం నత్తనడకన నడుస్తోందని ఆయన అన్నారు.
అలాగే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టల్ పాఠశాల శిథిల వ్యవస్థ లో ఉండి దాదాపు 10 సంవత్సరాల నుండి విద్యార్థులు వర్షాకాలం వస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక సార్ల ప్రజాప్రతినిధులకు జిల్లా విద్య శాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని దాంతోపాటు జూన్ 12వ తేదీ నుండి సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వ స్కూల్లో, జూనియర్ కళాశాల సమస్యల పైన సర్వేలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు జటంగి వేణు, మహేష్, పవన్ సుబోధ , మధు , దినేష్ , లోకేష్ , ప్రభు , అజయ్ తదితరులు సభ్యులు పాల్గొనడం జరిగింది.