సూర్యాపేట పట్టణంలో ముత్యాలమ్మ గుడి వద్ద టీఆర్ఎస్ యువజన నాయకులు నూకల శ్రీనివాస్, తన మిత్ర బృదం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం గణేష్ మండపం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు బీరవోలు శ్రీహర్ష, కీసర వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి అనిల్ రెడ్డి, గొనె అశోక్, పరెడ్డి ఉపేందర్, కూతురు సతీష్ తదితరులు పాల్గొన్నారు.