గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించామని కమిటీ అధ్యక్షులు రవీందర్ బాబు విజయలక్ష్మి అన్నారు. సూర్యాపేట జమ్మిగడ్డలో ఆదివారం శ్రీ దత్త సాయి మందిరంలోని సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు సాయినాథుడిని దర్శించుకున్నారు. సాయిబాబా ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయంలో పంచామృత అభిషేకాలు, సాయి సత్యా వ్రతం, ప్రత్యేక పుష్పాలతో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.