సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గ్రాండ్ హోటల్ లో సరస్వతి విద్యాలయ ఉన్నత పాఠశాల 2001 -02 పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్నేహితుల కలయిక మధురం అయితే ఆత్మీయ పలకరింపు సుమనోహరం అనుకునే విధంగా విద్యార్థులు ఒకరినొకరు పలకరించుకొని పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. 33సం. తర్వాత స్నేహితులు ఒకరికొకరు కలుసుకోవడంతో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.