వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరగనున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని గిద్దె రాజేష్ పిలుపు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచి అసెంబ్లీ వరకు త్వరలోనే పాదయాత్ర విధివిధానాలపై రాష్ట్ర కార్యవర్గంలో చర్చించనున్నట్లు వెల్లడించారు.