టీఆర్ఎస్ నాయకులు కోట్యా కు నివాళులు

1066చూసినవారు
టీఆర్ఎస్ నాయకులు కోట్యా కు నివాళులు
సపావత్ తండా గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, మాజీ సింగల్ విండో డైరెక్టర్ దరవత్ కోట్యా(75) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహం పై సూర్యాపేట జడ్పీటీసీ జీడీ బిక్షం, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు, సర్పంచ్ రమవత్ లాలూ నాయక్, ఎంపీటీసీ ఉప్పల లక్షమ్మ సైదులు, మాజీ సర్పంచ్ ఆనంతుల వాసుదేవరెడ్డిలు పూల మాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట ఉప సర్పంచ్ సురేందర్ కో ఆప్షన్ సోమ్లా నాయక్, గ్రామ వార్డు మెంబర్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్