సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత వారం రోజుల నుండి ఎడతెరపి లేని ముసురు కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు. రాగల నాలుగు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.