వార్డు అభివృద్ధే ధ్యేయం: కౌన్సిలర్

764చూసినవారు
వార్డు అభివృద్ధే ధ్యేయం: కౌన్సిలర్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 45 వ వార్డు విద్యానగర్ భూమిరెడ్డి హాస్పిటల్ వద్ద విద్యుత్ స్ధంభాలపై వాలిపోతున్న ఏండిపోయిన చెట్లను మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ
సిబ్బంది సహకారంతో వార్డు కౌన్సిలర్ గండూరి పావని తన స్వంత ఖర్చులతో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ పర్యవేక్షణలో తొలగించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ.. మంత్రివర్యులు జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డులో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న ఎండిపోయిన చెట్లను వార్డు కౌన్సిలర్ గండూరి పావ నికృపాకర్ , విద్యుత్, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో తొలగించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూమిరెడ్డి, ఇమ్మడి రాజేందర్, కుక్కడపు సాలయ్య, కస్తూరి నవీన్, కుక్కడపు భిక్షం, కొప్పు సందీప్, కళ్యాణ్, మున్సిపల్ జవాన్ వెంకన్న, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్ మెన్ పురుషోత్తం, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్