యాదగిరిగుట్ట: వన్యప్రాణులను రక్షించాలంటూ ఎంపీడీవోకు వినతిపత్రం

76చూసినవారు
యాదగిరిగుట్ట: వన్యప్రాణులను రక్షించాలంటూ ఎంపీడీవోకు వినతిపత్రం
యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా విస్తరించి ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వన్యప్రాణులకు తీవ్ర ముప్పు వచ్చిందని యాదగిరిగుట్ట ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. వాటిని నివారించేందుకు వెంచర్లలో పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటించేలా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని వన్యప్రాన్ల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ హరి ప్రసాద్ శ్రీకాంత్, జాంగిర్, నాగరాజు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్