యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రజలంతా ఓ చోటకు చేరి సందడిగా గడిపారు. అడ్డగూడూరు మండలం జానకీపురంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇద్దరు చిన్నారులు ‘బుజ్జితల్లి’ సాంగ్‌కు వేసిన డాన్స్ మైమరిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.