సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం, వంగమర్తి వాగులోంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక మాఫియా నడుస్తుంది. భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. రాత్రి, పగలు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ప్రభుత్వం వెంటనే అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.