సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త రింగు బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వారి నివాసానికి వెళ్లి బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.