తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు యాసంగి వరి సాగు కోసం మంగళవారం సాయంత్రం గంధమల్ల రిజర్వాయర్ నుంచి మోత్కూరు బిక్కేరులోకి నీరు విడుదల చేయించినట్లు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రిజర్వాయర్ ద్వారా నీరందించాలని విజ్ఞప్తి చేసినట్లు, మంత్రి ఆదేశాల మేరకు సాగునీటి పారుదలశాఖ ఎస్ఈ శ్రీనివాస్ బిక్కేరులోకి నీటిని వదిలారని పేర్కొన్నారు.