వర్ధమానుకోటలో సోడియం హైపో క్లోరైడ్ మందు పిచికారీ

969చూసినవారు
వర్ధమానుకోటలో సోడియం హైపో క్లోరైడ్ మందు పిచికారీ
సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణకై గ్రామంలోని పలు విధుల్లో సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయించిన తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ మాట్లాడుతూ....గ్రామంలో 6 గురికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు రావడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రజలు ఒక్కరు కూడా బయటికి వెళ్లకుండా బయటి వాళ్ళను గ్రామంలోకి రాకుండా ఉండాలని కోరారు. గ్రామంలోని వీధుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా సోడియం హైపో క్లోరైడ్ మందును నీళ్లలో కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్